ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 300 ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ కేటగిరీలో ఈ అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం నెల వారీగా స్టైఫండ్ అందుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం..
ఖాళీలు వివరాలు:
మెకానికల్, ఎలక్ట్రికల్, టెలీకమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అకౌంట్స్ లేదా ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఆపరేటర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు:
విభాగాల వారీగా విద్యార్హతలు ఉన్నాయి.
ట్రేడ్ అప్రెంటిస్:
ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ లేదా మెషినిస్ట్ కోర్సు చేసి ఉండాలి.
టెక్నికల్ అప్రంటీస్:
మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్:
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (ప్రెషర్ అప్రంటీస్):
: 12వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీ ఆపరేటర్:
12వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు లేదా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ట్రేడ్ అప్రెంటిస్ - రిటేల్ సేల్స్ అసోసియేట్(ప్రెషర్)
12వ తరగతి పాసైన నాన్ గ్రాడ్యుయేట్స్ ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
ట్రేడ్ అప్రెంటిస్ - రిటైల్ సేల్స్ అసోసియేట్ (స్కిల్డ్ సెర్టిఫికెట్ హోల్డర్స్):
12వ తరగతి పాసై 'రిటైల్ ట్రేడ్ అసోసియేట్' స్కిల్ సర్టిఫికెట్ కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 27
దరఖాస్తు విధానం: ఆన్లైన్
పూర్తి వివరాలకు వెబ్సైట్లు
-ట్రేడ్ అప్రెంటిస్-ఐటిఐ అభ్యర్థులు:
http://apprenticeshipindia.org/candidate-registration ఈ లింక్ తో అప్లై చేసుకోవాలి.
-ట్రేడ్ అప్రంటీస్ అకౌంటెంట్ అభ్యర్థులు http://apprenticeshipindia.org/candidate-registration
ఈ లింక్ తో అప్లై చేసుకోవాలి.
-ట్రేడ్ అప్రంటీస్ - డేటా ఎంట్రీ ఆపరేటర్& రిటైల్ సేల్స్ అసోసియేట్ అభ్యర్థులు http://apprenticeshipindia.org/candidate-registration ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
టెక్నికల్ అప్రంటీస్- డిప్లమా అభ్యర్థులు https://www.mhrdnats.gov.in/boat/commonRedirect/registermenunew!registermenunew.action లింక్ ద్వారా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa