అసోంలోని కామరూప్ జిల్లాలో ఏనుగు గుంపును తరిమే ప్రయత్నం లో రెండేంళ్ల చిన్నారి మృతి చెందిది. కానీ ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసోంలోని కామరూప్ జిల్లాలోని బోకోలోని బోండపారా ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. వీటిని తరిమేందుకు అటవీ సిబ్బంది కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏనుగులను బెదిరించేందుకు గురువారం రాత్రి వారు తుపాకీలతో కాల్పులు జరిపారు. దాంతో ఓ తూటా ప్రమాదవశాత్తూ.. అక్కడి సమీపంలోని ఓ ఇంటి ముందు అమ్మఒడిలో కూర్చున్న బిడ్డ శరీరాన్ని తాకింది. అలాగే తల్లి కూడా గాయపడింది. గార్డులు వెంటనే వారిద్దరి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి తల్లి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మెరుగైన వైద్యం కోసం ఆమెను గువహటి వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa