రైల్వే ప్రయాణికులకు మెరుగైన భద్రత కల్పించడమే తమ ధ్యేయమని గుంటూరు డివిజన్ ఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ శరత్‌బాబు పేర్కొన్నారు. రేపల్లె రైల్వేస్టేషన్ ఆవరణలోని కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రైళ్లలో దొంగతనాలు జరక్కుండా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని సూచించారు. తొలుత స్టేషన్ పరిసరాలు, కార్యాలయ దస్త్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎస్సై చంద్రశేఖర్, ఏసుపాదం, సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa