ఎస్ బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మూసివేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్ ఆరు స్కీమ్‌ల యూనిట్ హోల్డర్‌లకు రూ. 985 కోట్ల 8వ వాయిదా చెల్లింపును సోమవారం నుండి ప్రారంభించనుంది. ఈ పథకాలను మూసివేసిన తర్వాత ఫిబ్రవరిలో తొలి విడతగా రూ.9,122 కోట్లు పెట్టుబడిదారులకు అందించారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో 2,962 కోట్లు, మేలో 2,489 కోట్లు, జూన్‌లో 3,205 కోట్లు, జూలైలో 3,303 కోట్లు, సెప్టెంబర్‌లో 2,918 కోట్లు, నవంబర్‌లో రూ.1,115 కోట్లు ఇచ్చారు. తాజాగా ఈ వాయిదా తర్వాత చెల్లించిన మొత్తం రూ.26,098.2 కోట్లు అవుతుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa