అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర నేటితో ముగియనుంది. 44 రోజులుగా రైతులు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 400 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. నవంబర్ 1న తుళ్లూరు నుంచి న్యాయస్థానం- దేవస్థానం పేరుతో ఈ పాదయాత్ర ప్రారంభం అయింది. 45వ రోజైన ఇవాళ అలిపిరిలో ముగియనుంది. ఈ నెల 17న అమరావతి ఆంక్షలు చాటేలా బహిరంగ సభ నిర్వహించేందుకు అమరావతి జేఏసీ నేతలు సిద్దమవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa