ఏపీ లోని కృష్ణ జిల్లా పెడనలో దొంగ నోట్ల ప్రింటింగ్ కదొంగ నోట్ల ప్రింటింగ్ కలలకలం రేపింది, గుట్టు చప్పుడు కాకుండా ఈ బడా వ్యాపారం చేస్తున్నారు. ఒక లక్ష కు నాలుగు లక్షలు ఇస్తాం అంటూ ఆకర్షిస్తున్నారు. ఈ వ్యాపారంలో మధ్య వర్తులకు 40 పర్శంటేజ్ కమిషన్ కూడా ఇస్తున్నారు. ఈ కృష్ణ జిల్లా పెడనలో దొంగ నోట్ల ప్రింటింగ్.. వ్యాపారం లో ఇప్పటివరకు స్కానర్లు, ప్రింటింగ్ మెషీన్స్ ఇంకా 9 మంది ని అరెస్ట్ చేసినట్టు సమాచారం. వారి వద్ద నుండి పెడన పోలీసులు 3 లక్షల రూపాయల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టణంలోని వీరభద్రపురంకు చెందిన ఓ తండ్రి కొడుకులు కాసా నాగరాజు, కొడుకు చందు నకిలీ నోట్లను ముద్రించి చాలా మందికి చలామణి చేస్తున్నారు.
పట్టణంలోని 20 వార్డు రామలక్ష్మి కాలనీకి చెందిన వ్యక్తి వాసా వెంకటేస్వారావు మీడియేటర్ గా వ్యవహరిస్తూ ఈ నోట్లను చలామణి చేస్తున్నారు. అసలు నోట్లు లక్ష ఇస్తే.. నాలుగు లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నాడు. ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ మురళి అప్రమత్తమై సోమవారం తెల్లవారుజామున దాడులు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa