ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లోనూ కలవరం పుట్టిస్తుంది. దేశంలో క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో.. ఒమైక్రాన్ కేసులు 57కు పెరిగాయి. ఢిల్లీ, ముంబైలలో మంగళవారం 12 ఒమైక్రాన్ కేసులు బయటపడ్డాయి. వీటిలో 8 కేసులు ముంబై మహానగరం, శివారు ప్రాంతాల్లోనే నిర్ధారణ అయ్యాయి. ఒమైక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో ఎవరికీ విదేశీ ప్రయా ణ చరిత్ర లేదని గుర్తించారు. అయితే ఒక వ్యక్తి బెంగళూరుకు, మరో వ్యక్తి ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు వెల్లడైంది. ఆ 8 మందిలో ఒక్కరు మినహా అందరూ వ్యాక్సిన్ వేసుకున్న వారేనని అధికారులు తెలిపారు. ఢిల్లీలో మరో నలుగురికి ఒమైక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారేనని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa