బీహార్‌లోని భోజ్‌పుర్ జిల్లాలో దారుణం జరిగింది. వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను హత్యచేశాడు. వివరాల్లోకి వెళితే.. భోజ్‌పూర్ జిల్లా షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బధర్ గ్రామంలోని ఒకరి పొలంలో ఇటీవల ఓ వివాహిత మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె మెడ దగ్గర గాయమైనట్లు కనిపించింది. దీంతో ఆమెను ఉరేసి చంపి మృతదేహాన్ని పొలాల్లో పడేశారని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం తన కూతురుదేనని అజయ్ అనే ఓ వ్యక్తి పోలీసులకు చెప్పాడు. అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు నిందితుడిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైన మహిళ భర్త తన వదినతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడని తెలిసింది. ఆ విషయంపై నిలదీసినందుకే అతడు తన భార్యను చంపేసినట్లు తెలిసింది. భార్య అడ్డు తొలగించుకునేందుకు ఉరేసి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూసినట్లు తెలిసింది. పోలీసులు ఆ వదిన, మరిదితో పాటు వారికి సహకరించిన మరో ముగ్గురిని ఈ హత్య కేసులో అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa