దేశంలో మరో 6 వేల 650 కరోనా కేసులు..... నమోదయ్యాయి. గురువారం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకూ...ఈ మేరకు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి దేశంలో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య.. 3 కోట్ల 47 లక్షల 72 వేల 626కు చేరాయి. మరో 374 మంది కొవిడ్ కు బలికాగా... దేశవ్యాప్తంగా వైరస్ తో మృతి చెందినవారి సంఖ్య 4 లక్షల 79 వేల 133కు పెరిగింది. మరో 7 వేల 51 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య.... 3 కోట్ల 42 లక్షల 15 వేల 977కు చేరింది. ప్రస్తుతం దేశంలో 77 వేల 516 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ..140 కోట్ల 31 లక్షల డోసులు దాటింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa