జమ్ముకశ్మీర్ లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పులను తిప్పికొట్టిన సైన్యం.... ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని... బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa