ప్రపంచ వ్యాప్తంగా సోమవారం రోజున 14.4 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ ప్రభావంతోనే ఈ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. తాజాగా కేసులు ఒక నెల క్రితం నమోదైన కేసులతో పోలిస్తే 49శాతం ఎక్కువ. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ తొలి సార్స్‌కోవ్-2 కంటే 70 రెట్లు వేగంగా వ్యాపిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. వ్యాక్సిన్ తీసుకొన్న వారిపై ఒమిక్రాన్ ప్రభావం నామమాత్రంగానే ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa