ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా టికెట్ల అంశంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 28, 2021, 05:28 PM

సినిమా టికెట్ల అంశంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి విశ్వజిత్‌ ఛైర్మన్‌ గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక ముఖ్యకార్యదర్శులు, సమాచార శాఖ కమిషనర్‌, న్యాయశాఖ కార్యదర్శి, కృష్ణా జిల్లా జేసీతో పాటు థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ గోయర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఉంటారు. థియేటర్ల వర్గీకరణతో పాటు టికెట్ల ధరలను ఈ కమిటీ నిర్ధారించనుంది. అనంతరం ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa