బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. హిందుయేతరుల ప్రవేశంపై నిషేధం విధించే ప్రతిపాదనలను త్వరలో అమలు చేయనున్నట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ వెల్లడించింది. ఆలయాల పవిత్రత, సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ అంశానికి సంబంధించిన ప్రతిపాదనలకు త్వరలో అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉందని కమిటీ వర్గాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa