సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 327 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 272/3 స్కోరుతో మూడో రోజు ఆరంభించిన భారత్ మరో 55 పరుగులు మాత్రమే చేసి మిగిలిన 7 వికెట్లు కోల్పోయింది. భారత బ్యాట్స్ మెన్ లలో కెఎల్ రాహుల్ 123, మయాంక్ 60, కోహ్లీ 35, రహానే 48 పరుగులు చేసి రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 3, ఎంగిడి 6, జాన్ సెన్ 1 వికెట్ పడగొట్టారు. వర్షం కారణంగా రెండో రోజు ఆట పూర్తిగా రద్దయిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa