విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. రామతీర్థం ఘటనలో తనపై నమోదు చేసిన కేసు కొట్టి వేయాలని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎఫ్‌ఐఆర్‌లో తదుపరి చర్యలు నిలిపివేయాలని స్పష్టం చేసింది. రామతీర్థం బోడికొండపై కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో ఉద్రిక్తత తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆలయ ఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలయ ధర్మకర్త అశోక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa