ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ అవినీతి లో రికార్డు స్థాయిలో ఉందని అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 2021 ఏడాదికి సంబంధించి వార్షిక నివేదికను అవినీతి నిరోధక శాఖ (అ.ని.శా) విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో అవినీతిలో రెవెన్యూ శాఖ అగ్రస్థానంలో ఉందని అ.ని.శా పేర్కొంది. రెవెన్యూ శాఖలో అవినీతికి సంబంధించి ఈ ఏడాది 36 కేసులు నమోదు చేసినట్లు అ.ని.శా వెల్లడించింది. అలాగే విద్యుత్ శాఖలో 6, ఆర్‌అండ్‌బీ - 9, హోంశాఖ - 6, మున్సిపల్‌లో -5, అక్రమాస్తుల కేసులు 12 నమోదు చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 72 ట్రాప్ అవినీతి కేసులు ఉండగా, ఆకస్మిక తనిఖీల్లో 45 కేసులు, సాధారణ విచారణల్లో 26 కేసులు నమోదు చేసినట్లు నివేదికలో అ.ని.శా తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa