ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్పు కోసం షేమింగ్ కార్యక్రమం

international |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 11:44 PM

కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలు యథేచ్చగా కొనసాగుతుండటంతో చైనాలో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. దక్షిణ చైనా పోలీసులు పబ్లిక్ షేమింగ్‌కు పాల్పడినట్లు కెమెరాల్లో రికార్డయింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన నలుగురిని బహిరంగ ప్రదేశాల్లో ఊరేగించడం ఆ వీడియోల్లో కనిపించింది. కరోనా కారణంగా చైనా సరిహద్దులు మూసివేశారు. కానీ, కొందరు అక్రమంగా ప్రజలను సరిహద్దు దాటించడం, ఇతర దేశాల నుంచి తేవడం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి ఆరోపణలతో ఈ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్వాంగ్జీ ప్రావిన్సులోని జింగ్సీ నగర వీధుల్లో వారిని ఊరేగించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో భిన్న స్పందనలు వచ్చాయి. డిసెంబర్ 28న ఈ ఘటన జరిగింది. హజ్మత్ సూట్లతో పాటు ఫేస్ షీల్డ్‌లను ధరించిన నలుగురు... చేతిలో తమ పేరు, వివరాలు, పొటోతో కూడిన ప్లకార్డులను పట్టుకొని వీధుల్లో పోలీసులతో నడుస్తోన్న వీడియో బయటకొచ్చింది. ఈ చర్యలతోనైనా చైనా ప్రజల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa