తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం జాతీయ రహదారి నెంబర్ 30 లక్ష్మీపురం గ్రామం మూలమలుపు వద్ద శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్రం భద్రాచలం వైపునుంచి చింతూరు వైపుగా ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa