మనుషులు చనిపోతే వాళ్ల జ్ఞాపకంగా సమాధులు కట్టి..ప్రతీ సంవత్సరం చనపోయినరోజు వెళ్తుంటారు. ఈ మధ్య పెంపుడు జంతువులు చనిపోయినా ఇలానే చేస్తున్నారు. ఎందుకంటే వాటి జ్ఞాపకాలు మనకెప్పుడు అలానే మిగిలిపోవాలని. కానీ మీరు ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ కి సమాధులు కట్టడం ఎక్కడైనా విన్నారా. యూఎస్‌లోని ఓ ఐస్‌క్రీమ్ పార్లర్ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్స్ కి సమాధులు ఏర్పాటు చేస్తోంది. వెర్మంట్‌లోని వాటర్‌బర్నీ అనే గ్రామంలో బెన్ అండ్ జెర్రీ అనే ఫేమస్ ఐస్‌క్రీమ్ పార్లర్ ఉంది. 1978లో దీన్ని ప్రారంభమైన ఈ పార్లర్ అనేక రకాల ఫ్లేవర్లను సృష్టించి విక్రయిస్తూ ప్రత్యేకంగా నిలిచిందని, అందుకే నగరాల నుంచి ఎంతో మంది ఈ ఐస్‌క్రీమ్ తినడానికి వచ్చేవారట. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బ్రాంచెస్ కూడా ఏర్పాటయ్యాయి. అయితే, ప్రతి దానికి ఒక ప్రారంభం, ముగింపు ఉన్నట్లే వీరు తయారు చేసే ఐస్‌క్రీమ్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త రకం ఫ్లేవర్లను పరిచయం చేసే ఈ సంస్థ వాటిని కస్టమర్లు ఇష్టపడకపోతే తయారు చేయడం మానేస్తుంటుంది. అలా తయారు చేయడం మానేసిన ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లకు బెన్ అండ్ జెర్రీ సంస్థ సమాధులు ఏర్పాటు చేస్తుంది.
కస్టమర్లకు నచ్చని ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌ను భూమిలో పాతిపెట్టి మనుషులకు అంత్యక్రియలు జరిపించినట్లుగానే జరిపిస్తోందీ. ఆ తర్వాత ఆ ఫ్లేవర్ ఫొటో దాని ప్రత్యేకత, ఏ కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంది అనే వివరాలను శిలాఫలకంపై చెక్కి సమాధి నిర్మిస్తుంటుంది. అలా ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లకు ఈ పార్లర్ సమాధులు కట్టించింది. ఆ సమాధుల ఫొటోలను సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘ఫ్లేవర్ గ్రేవ్‌యార్డ్’ విభాగంలో ఉంచింది. సమాధులుగా మారిన ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లలో దేన్నైనా ఎక్కువ మంది కస్టమర్లు కోరితే దాన్ని తిరిగి తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సంస్థ చెబుతోంది. కస్టమర్లను ఎట్రాక్ట్ చేయడం, వాళ్ల పల్స్ తెలుసుకోవటం భాగంగానే ఇలాంటి వినూత్నపనులను ఐస్ క్రీమ్ బిజినెస్ మ్యాన్లు చేస్తుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa