తమిళనాడులో ఒమిక్రాన్ భయపెడుతోంది. శుక్రవారం ఒక్క రోజే ఆ రాష్ట్రంలో 70కి పైగా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు అక్కడ నమోదైన కేసులు 120 కి చేరుకున్నాయి. దీంతో స్టాలిన్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ముందు జాగ్రత్తలో భాగంగా నేటి నుండి 1-8వ తరగతి వరకు స్కూళ్లు మూసివేయాలని నిర్ణయించారు. అలాగే 50 శాతం ఆక్యుపెన్సీతో మాల్స్, థియేటర్లు, మెట్రోలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది ప్రభుత్వం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa