గుంటూరు: వైకాపా ప్రభుత్వం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ వలన లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పనులేకుండా నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే పింఛన్ అందుతుంది. ఈ నేపథ్యంలో మంగళగిరి పట్టణం ఇందిరా నగర్ 6 వార్డు కు చెందిన ఓట్లు సత్యవతి కి అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరులోని ఓ ఆసుపత్రి ఐసియులో చికిత్స పొందుతున్నారు. ఫించన్ ల పంపిణీ ప్రారంభించిన వాలంటర్ గడ్డ సాంబశివరావు విషయం తెలుసుకుని గుంటూరు లోని ఆసుపత్రికి వెళ్లి రూ. 2, 500 వితంతు పింఛన్ ను లబ్ధిదారులకు అందజేశారు. దీంతో పలువురు వాలంటీర్ ను అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa