హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. సిమ్లా జిల్లాలోని కుప్వి ప్రాంతంలో దట్టమైన మంచు కురుస్తున్న నేపథ్యంలో కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు కుప్విలోని నౌరా-బౌరా పంచాయతీలోకి ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa