విజయవాడలో తెలుగుదేశం పార్టీ నాయకుని కిరాతకానికి ఆత్మహత్య చేసుకొన్న 14 ఏళ్ల బాలిక ఆత్మ శాంతికై గూడూరు పట్టణంలోఎమ్మెల్యే వరప్రసాద్ రావు ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ పట్టణాధ్యక్షులు బొమిడి శ్రీనివాసులు మాట్లాడుతూ
బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చట్టాలు తీసుకొచ్చినా అఘాయిత్యాలకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదన్నారు.
విజయవాడలో చిన్నారి మరణానికి కారణమైన వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీల నాయకులు అమన్, తూపిలి లక్ష్మీ, నెల్లటూరు భవాని పలువురు మహిళలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa