క్రిస్టోఫర్ మారిస్ బ్రౌన్ ఒక అమెరికన్ గాయకుడు, రాపర్, పాటల రచయిత, నర్తకి మరియు నటుడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొన్నాడు. అతని పాటలకు చాలా మంది ఫిదా అవుతారు. అతనిపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో అతనిపై కేసు నమోదైంది. ఓ మహిళ తనను ఎంతో ఇబ్బంది పెట్టాడని, అత్యాచారం చేశాడని ఆమె పేర్కొంది. రాపర్ సీన్ కాంబ్స్ నివాసమైన ఫ్లోరిడాలోని స్టార్ ఐలాండ్‌లో తనను కలవడానికి బ్రౌన్ ఆహ్వానించాడని ఆమె పేర్కొంది. బ్రౌన్‌తో చర్చిస్తున్నందున బ్రౌన్ డ్రింక్ ఆఫర్ చేశాడని తెలిపింది. ఒకటి అయిపోగానే రెండవ పానీయం ఇచ్చాడని తెలిపింది. తర్వాత తను అకస్మాత్తుగా దిక్కుతోచని స్థితిలో శారీరకంగా అచేతనంగా మారిపోయానని తెలిపింది. ఆ స్థితిలో బ్రౌన్ తనను బెడ్‌రూమ్‌లోకి లాగి, బికినీ బాటమ్‌లను తొలగించి సమ్మతి లేకుండా తనపై అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఈ కేసుపై బ్రౌన్ వెంటనే స్పందించ లేదు. అయితే అతని ఇన్‌స్టాగ్రమ్‌లో ఇలా రాసుకొచ్చాడు. "నేను సంగీతం లేదా ప్రాజెక్ట్‌లను విడుదల చేస్తున్నాను. కానీ కొందరు నన్ను వెనక్కు లాగడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ పోస్ట్ చేశాడు. కోర్టు పత్రాలలో ఆమె పేరు జేన్ డోగా పేర్కొన్నారు. మహిళ, ఆర్ అండ్ బీ స్టార్ నుంచి $20 మిలియన్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తోంది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అయితే గతంలోనూ బ్రౌన్‌పై ఆరోపణలు ఉన్నాయి. 2009లో ఈ జంట డేటింగ్ చేస్తున్నప్పుడు గాయని రిహన్నాపై దాడి చేసినందుకు బ్రౌన్ నేరాన్ని అంగీకరించాడు, ఈ సంఘటన ఆమె గాయపడిన ముఖం యొక్క ఫోటో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ వార్త మారుమోగింది. 2019లో ప్యారిస్ హోటల్ గదిలో బ్రౌన్ తనపై అత్యాచారం చేశాడని ఒక మహిళ ఆరోపించింది. గాయకుడు ఆ ఆరోపణలను ఖండించారు. అయితే నిందితుడిపై పరువు నష్టం ఫిర్యాదును దాఖలు చేశారు. ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa