ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధప్రదేశ్ రాష్ట్ర సర్కార్ మరో శుభవార్త తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న 60 ఏళ్ల వయసును నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఫైలుపై ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ఆమోద ముద్ర వేశారు. 2022 జనవరి 1నుంచి ఈ ఉత్వర్వులు అమలు చేయనున్నట్టుగా ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం పేర్కొంది.
కాగా, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకి ప్రభుత్వం పెంచుతూ మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్‌కు పంపింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అర్డినెన్స్ పైలుపై గవర్నర్ సోమవారం సంతకం చేశారు. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఇక, పదవీ విరమణ వయసుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం వరకు ఆర్డినెన్స్ రాకపోవడంతో నేడు రిటైర్ కావాల్సిన ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటివకే ఆయా విభాగాల ఉద్యోగులకు పదవీ విరమణ దస్త్రాలు చేరాయి. అయితే మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో గందగోళానికి తెరపడింది. ఈరోజు పదవీ విరమణ చేసే వారికి ఊరట లభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa