ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ అన్న వస్తే జాబు అన్నారు.. మరేది జాబ్.?: ఏపీ నిరుద్యోగులు ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 07:24 PM

జగన్ అన్న వస్తే జాబు అన్నారు.. మరేది జాబ్.? అని  ఏపీ నిరుద్యోగులు  ఏపీ సర్కారు పై ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం జగన్ సర్కార్ పై ఏపీ నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ నగర్ పార్క్ దగ్గర నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుంటే మీ ప్రభుత్వాన్ని పీకేస్తామని నిరుద్యోగులు హెచ్చరించారు. అన్న వస్తే జాబు అంటూ చెప్పారు.. ఆ మాటలు నిరుద్యోగులు మరిచిపోలేదాని  ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని మాకు ఉద్యోగాలు ఇవ్వరా అని ప్రశ్నించారు. రెండున్నర లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు కుదించాలన్నారు. నోటిఫికేషన్లు వేయక పోతే తాడేపల్లిని ముట్టడిస్తామని ఏపీ నిరుద్యోగులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అశోక్ నగర్ స్టడీ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులు,  ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికేపుడి శ్రీనివాస్ రావు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa