ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలను వేధిస్తున్నట్టు నారా లోకేష్ పీఏ పై ఆరోపణలు ఉన్నాయ్: ఏపీ హోంమంత్రి సుచరిత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 07:43 PM

మహిళలను వేధిస్తున్నట్టు నారా లోకేష్ పీఏ పై ఆరోపణలు వచ్చాయని  ఏపీ హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.ఎవరైనా సరే నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరినీ విడిచిపెట్టబోమని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. రాష్ట్రంలో నేరాలు జరగడం లేదని చెప్పడం లేదు... అయితే తమ ప్రభుత్వం నేరస్తులపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో చూడాలన్నారు. మహిళలు, బాలికలపై చేయ వేస్తే  తమ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.
గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో ఇప్పటి వరకు 46 మందిని అరెస్టు చేశామన్నారు. విజయవాడ టీడీపీ నేత వినోద్ జైన్  పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు హోంమంత్రి సుచరిత . నారా లోకేష్ పీఏ మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు.ఎంత వారినైనా, ఎవరినైనా విచారించే అధికారం పోలీసులకు ఇచ్చామని చెప్పారు. ప్రతి మహిళ దిశా  యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa