ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పల్నాడు పేరును జిల్లాగా ప్రకటించడం సంతోషకరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 08:15 AM

పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు పేరును నర్సరావుపేటకు పెట్టి జిల్లాగా ప్రకటించటం సంతోషకరంగా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో సాధారణ సమావేశం సందర్భంగా ముఖ్య అతిధిగా పిఆర్కే మాట్లాడారు. సమావేశానికి మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ అధ్యక్షత వహించారు. అజెండాలోని అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.


ఎమ్మెల్యే పిఆర్కే మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసం సీఎం జగన్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయటం హర్షణీయమన్నారు. ఆయా ప్రాంతాలలోని ప్రజలు కోరుకుంటున్న విధంగా జిల్లాలకు పేర్లు పెట్టడం సంతోషకరమన్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కమీషనర్ గిరికుమార్, వైస్ చైర్మన్లు పోలూరి నరసింహా రావు, బోయ రఘురామిరెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు యాసిన్, మేనేజర్ రమణబాబు, పలు శాఖాధికారులు తదితరులున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa