ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్యుల సేవలు ప్రశంసనీయం: ఎమ్మెల్యే పీఆర్కే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 08:19 AM

గుంటూరు: మాచర్ల పట్టణం లోని ప్రభుత్వ వైద్యశాలను జిల్లాలో మొదటి స్థానంలో నిలపడంతోపాటు రాష్ట్రంలో మూడో స్థానం సాధించేందుకు కృషి చేసిన వైద్యుల సేవలు ప్రశంసనీయమని ప్రభుత్వ విప్, శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ వైద్యశాల వైద్యుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేశామని, త్వరలోనే వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ బండారు రంగారావు, సిబ్బందిని దుశ్శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్, శ్రీనివాసశర్మ, టౌన్ వీరారెడ్డి, మదార్ సాహెబ్, సుభానిసాహెబ్, బత్తుల ఏడుకొండలు, యాసిన్ తదితరులున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa