ఫిరంగిపురం పంచాయతీ కార్యదర్శి సంతకం, పంచాయతీ స్టాంపును ఫోర్జరీ చేసి ఓ తండ్రి తన కొడుకు పేరిట ఇంటిని రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం ఆలస్యంగా బయటపడింది. మోసానికి పాల్పడిన ఆ తండ్రీకొడుకులపై చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ కార్యదర్శి శౌరీకుమారి ఫిరంగిపురం స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వైనమిది.
పోలీసులు తెలిపిన మేరకు.. మండలం లోని పొనుగుపాడు పంచాయతీ కార్యదర్శిగా పెద్దకోట్ల శౌరికుమారి పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు కలతోటి జాన్‌పాల్, భార్గవ్ కలిసి జులై 3, 2020న పంచాయతీ కార్యదర్శి వద్దకు వచ్చారు. తన పేరిట ఉన్న ఇంటిని భార్గవ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఆమెను కోరారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనకు అలాంటి ధ్రువీకరణ పత్రం ఇచ్చే అధికారం లేదని కార్యదర్శి అన్నారు. వారు తమకు పంచాయతీ ఇలాఖాలో ఇల్లు ఉన్నట్లు తెల్ల కాగితంపై రాసి పంచాయతీ స్టాంపు, ఆమె సంతకం చేసి ఇవ్వాలని కోరారు.
ఈ నేపథ్యంలో ఆమె గ్రామ పంచాయతీ ఇంటి పన్ను డిమాండ్ రిజిష్టర్ దాఖల అసెస్‌మెంట్ నంబరు 981, 2019-2020 గ్రామ పంచాయతీ రిజిష్టర్ ప్రకారం పొనుగుపాడులో ఇల్లు ఉన్నట్లు రాసి ఇచ్చారు. తర్వాత తండ్రీ కొడుకులు కలర్ జిరాక్స్‌తో వారికి కావాల్సిన విధంగా డాక్యుమెంట్ తయారుచేయించి, దానిపై పంచాయతీ కార్యదర్శి సంతకం, స్టాంప్ ముద్రను జత కలిపారు. ర
సీదు ఇచ్చిన మరుసటి రోజు నకిలీ డాక్యుమెంట్ ఉపయోగించుకొని జులై 4, 2020న ఫిరంగిపురం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో జాన్‌పాల్ పేరిట ఉన్న ఇంటిని ఆయన కుమారుడు భార్గవ్‌కు రిజిస్ట్రేషన్ చేశారు.
ఇదిలా ఉండగా కొన్నాళ్లకు జాన్‌పాల్‌కు గ్రామంలోని సర్వే నెంబర్ 303/బీలో 304 చదరపు అడుగుల ఇంటికి పంచాయతీ కార్యాలయం ధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చింది? పత్రం ఉంటే నకళ్లను ఇవ్వాలంటూ పెదకూరపాడు నియోజకవర్గలోని క్రోసూరు గ్రామవాసి నర్రా పిచ్చియ్య సమాచార హక్కు చట్టం కింద పంచాయతీ కార్యాలయానికి దరఖాస్తు చేశారు.
దీనికి పంచాయతీ కార్యదర్శి, జాన్‌పాల్ కోరినట్లు వారి ఇంటికి ఎలాంటి ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని, ఇంటి పన్ను చెల్లించినట్లు రసీదు ఇచ్చినట్లు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో తృప్తి చెందని నర్రా పిచ్చియ్య జాన్‌పాల్ చేసిన ఇంటి రిజిస్ట్రేషన్‌పై సమాచార హక్కు చట్టం కమిషనర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో కార్యదర్శి శౌరికుమారిని జవనరి 27, 2022న హియరింగ్‌కు హాజరు కావాలని కమిషనర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. జాన్‌పాల్, భార్గవ్‌కు ఇంటి పన్ను రసీదు మాత్రమే ఇచ్చానని ఆమె కమిషనర్ కార్యాలయానికి సమాధానం ఇచ్చారు. తండ్రీకొడుకులు జాన్‌పాల్, భార్గవ్ కలిసి తయారు చేసిన నకిలీ డాక్యుమెంట్ నకళ్లను పిచ్చియ్య కమిషనర్ కార్యాలయంలో అధికారులకు చూపించారు.
స్పందించిన కమిషనర్ పంచాయతీ కార్యదర్శి శౌరికుమారికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిరంగిపురం సబ్-రిజిస్టర్ కార్యాలయంలో జాన్‌పాల్ కుటుంబీకులు ఇచ్చిన డాక్యుమెంట్ నకిలీదని పంచాయతీ ఉన్నతాధికారులు తేల్చారు.
దొంగ పత్రం స్పష్టించి తన అనుమతి లేకుండా సంతకం, పంచాయతీ కార్యాలయ స్టాంపు ఉపయోగించుకొని ఫిరంగిపురం సబ్-రిజస్ట్రార్ కార్యాలయంలో ఇంటిని దొంగ రిజిస్ట్రేషన్ చేసినందుకు జాన్‌పాల్ అతని కొడుకు భార్గవ్‌పై కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa