రైతులకు ప్రయోజనకరంగా రైల్వేలను తీర్చిదిద్దనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 400 వందే భారత్ రైళ్లతో పాటు 100 గతిశక్తి టెర్మినల్స్‌ను , 25 వేల కి.మీ జాతీయ రహదారులను విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఇక నదుల అనుసంధానానికి పెద్ద పీట వేయనున్నట్లు తెలిపారు. కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి నదులను అనుసంధానిస్తామని వివరించారు.నిర్మలా సీతారామన్ ప్రసంగంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. కొవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ ప్రాత చాలా కీలకమన్నారు. ప్రైవేటీకరణలో భాగంగా ఎయిర్ ఇండియాను ప్రభుత్వం బదలాయించినట్లు.. అలాగే ఎల్‌ఐసీ ఐపీవోను తీసుకొస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa