ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇది జగన్ ప్రభుత్వం కాదు మహిళా ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 11:36 AM

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మహిళాభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నాం. మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ను తప్పనిసరి చేశాం. కోటి మందికి పైగా మహిళలు, విద్యార్థినులు దిశ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకున్నారంటే ప్రభుత్వంపై వారికి ఉన్న నమ్మకమే కారణం. మహిళలపై నేరాల విషయంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనడానికి చాలా ఉదాహరణలున్నాయి. మహిళలపై వేధింపులకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోము. విజయవాడలో చిన్నారి ఆత్మహత్యకు పాల్పడింది. కారకులు ఎవరో బహిరంగంగా అందరికి తెలిసినా కూడా టీడీపీ మహిళల కోసం నారీ సంకల్ప దీక్షలు అంటూ కొత్త నాటకాలకు తెరదీసింది. లేనివి కల్పించి ప్రత్యేక కథనాలు, డిబేట్లు నిర్వహించే చానల్స్‌ వారికి మద్దతుగా ఉన్నాయి  వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం కార్యకర్తల మీద ఉంది కాబట్టి గమనించి ముందుకు వెళ్లాలని సజ్జల రామకృష్ణ  హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa