ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ వల్ల కాకుంటే తప్పుకోండి జగన్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 11:42 AM

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా తయారయ్యింది రాష్ట్రప్రజల పరిస్థితి.నరేంద్ర మోడీ  ప్రభుత్వం లక్షల సంఖ్యలో రాష్ట్రానికి ఇళ్లను కేటాయించి, వేల కోట్ల నిధులను విడుదల చేసినప్పటికీ,జగన్  గారి ప్రభుత్వం అందుకు తగిన మ్యాచింగ్ గ్రాంట్ ను ఇచ్చి ఇళ్ళను కట్టివ్వడం లేదు..వైస్సార్ పార్టీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ రెండున్నర సంవత్సరాలలో రాష్ట్రంలోని పేదలకు ఒక్క ఇల్లు కట్టివ్వకపోగా,నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా కేంద్రం డబ్బులు ఇచ్చి కట్టిస్తున్న ఇళ్లకు జగనన్నకాలనీలు అని పేరొకటి!రాష్ట్రంలో పేదలకు ఇళ్ళు కట్టించి ఇచ్చే విషయంలో. జగన్  గారి ప్రభుత్వం వహిస్తున్న పూర్తి నిర్లక్ష్య వైఖరి కారణంగా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణ పేదలకు 20,40,640 ఇల్లు మంజూరు చేసి, ₹30,996.67 కోట్ల నిధులు మంజూరు చేసినా, వైసీపీ ప్రభుత్వం ఇళ్ళు కట్టివ్వని కారణంగా కేవలం 10,166.77 కోట్లు మాత్రమే విడుదల చేసింది. జగనన్న కాలనీలలో కూడా ఉపాధిహామీ పథకం నిధులను ఉపయోగించుకునే వైస్సార్ పార్టీ  నాయకుల చేత గ్రావెల్ రోడ్లు వేయించుకున్నారు. ఒక పక్క నరేంద్ర మోడీ  ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ప్రజలకు ఇల్లు కట్టివ్వాలని ఇలా అనేక రకాలుగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ, జగన్  గారి ప్రభుత్వం జగనన్న కాలనీలంటూ ఆర్భాటాలకే పరిమితమయ్యింది కానీ, పేదలకష్టాలు తీర్చలేదు!మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి,పేదలకు ఇళ్ళు ఎప్పుడు కట్టిస్తారో స్పష్టంచేయాలని జగన్  గారిని బీజేపీ ప్రశ్నిస్తోంది! మీవల్ల కాకపోతే రాష్ట్రప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పి,అధికారంనుండి పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నది!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa