ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్​ ధర

national |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 11:43 AM

కమర్షియల్ గ్యాస్ సిలిండర్​ ధర తగ్గింది. 19 కేజీల వాణిజ్య సిలిండర్​ ధరను రూ.91.50 మేర తగ్గించినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. సవరించిన ధరలు నేటి (ఫిబ్రవరి 1) నుంచే అమలుకానున్నట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. సవరించిన అనంతరం ఢిల్లీలో సిలిండర్​ ధర రూ.1907 గా ఉంది. చమురు సంస్థలు 14.2 కేజీల సిలిండర్ ధరను మార్చలేదు. దీంతో ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 14.2 కేజీల సిలిండర్ ధర దాదాపు రూ.960 వద్ద కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa