గుంటూరు: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలని వేమూరు శాసన సభ్యులు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వేమురునియోజకవర్గ పరిధిలోని భట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో ఎం. పీ. పీ, దావులూరి వెంకట లలిత కుమారి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల గ్రామాల్లో అధికారులు ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యలు రికార్డు పరంగా అందుబాటులో ఉంచాలన్నారు.
ఈ సందర్భంగా మండల పరిధిలోని పెదపులివర్రు గ్రామపంచాయతీ పరిధిలో పలువురికి నివేశన స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. దోమల నివారణకు ఫాగింగ్ మిషన్ పెదపులివర్రు సర్పంచ్ కి ఎమ్మెల్యే అందజేశారు. సమావేశంలో పలువురు అధికారులు ఆయా విషయాలను ఎమ్మెల్యేతో చర్చించారు.
సమావేశంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కె. పిచ్చయ్య శాస్త్రి, జెడ్.పి.టి.సి, తిరువీధుల ఉదయ భాస్కరి బాలాజీ, గ్రామ సర్పంచ్ దారా రవి కిరన్మయి చెన్నయ్య, కో ఆప్షన్ సభ్యులు షేక్ సలీం, భూర్ల రాంప్రసాద్, గోవర్ధనగిరి శేషాచల శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, మండల స్థాయి అధికారులు, ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa