ప్రియుడిపై మోజుతో ఓ మహిళ తన భర్తపై హత్యాయత్నం చేసింది. టీ లో విషం కలిపి పెట్టింది. అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఛతర్‌పూర్ జిల్లాలోని లవ్‌కుష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న సంతోష్ కు భార్య సుధ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అక్కడే నివసించే ప్రమోద్ అనే వ్యక్తితో సంతోష్ భార్య సుధ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త సంతోష్ కు తెలిసింది. ఈ విషయంలో భార్యకు నచ్చజెప్పేందుకు ఎంతో ప్రయత్నించాడు. ఇది సరైన పద్ధతి కాదని నలుగురితో చెప్పించాడు. అయినా ఆమె మారలేదు. అతనికి భార్య అంటే ప్రేమ ఎక్కువ. అందుకే ఆమెను దూరం చేసుకోవాలనుకోలేదు.
అయితే తన భర్త సంతోష్ ను చంపాలని సుధ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అతడు తాగే టీలో విషం ఇచ్చింది. దీంతో సంతోష్ ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్పత్రిలో చేరినా సంతోష్‌కు మాత్రం భార్య అంటే ఏ మాత్రం కోపం రాలేదు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తనకు తన భార్యే కావాలంటూ చెప్పుకొచ్చాడు. ప్రమోద్ తన భార్యను వదలడానికి ఇష్టపడటం లేదని సంతోష్ వాపోయాడు. తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా సంతోష్ ఇష్టపడటం లేదు. తన భార్య తనను చూడటానికి వస్తే మరోసారి ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే భర్త ఆస్పత్రిలో చేరినా అతడి భార్య సుధ మాత్రం భర్తను చూడటానికి రాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa