ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 12:05 PM

నాయకుడు కావాలంటే జట్టుకు కెప్టెన్‌ గానే ఉండాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లి అన్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు లేని తాను బ్యాటింగ్‌ మూలస్తంభంగా జట్టుకు మరింతగా ఉపయోగపడొచ్చని చెప్పాడు. కెప్టెన్సీ లేకున్నా జట్టుకు ఏ విధంగా సేవలు అందించగలడో ఓ కార్యక్రమంలో కోహ్లీ వివరించాడు.


తాను ఓ బ్యాట్స్‌మన్‌గా జట్టుకు ఇంకా చాలా చేయగలనేమోనని కోహ్లీ చెప్పాడు. జట్టు మరిన్ని విజయాలు సాధించేలా చేయగలనేమోనని అన్నాడు. నాయకుడిగా ఉండడానికి కెప్టెన్‌ కావాల్సిన అవసరం లేదని కోహ్లి అన్నాడు. 'ధోని కెప్టెన్ గా తప్పుకుని జట్టులో ఉన్నప్పుడు అతడు నాయకుడిగా లేడని అనలేం. నిరంతరం అతడి సలహాలను తీసుకునేవాళ్లం' అని కోహ్లి చెప్పాడు. 'నేను ఆటగాడిగా ఉన్నప్పుడు కూడా కెప్టెన్‌లాగే ఆలోచించా. జట్టును గెలిపించాలన్నదే నా కోరిక. నాకు నేను నాయకుడిగా ఉండాలి' అని కోహ్లి చెప్పాడు. తానెప్పుడూ కెప్టెన్ లా ఆలోచిస్తానని అన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa