ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిన్నాటవర్ పై జాతీయ జెండా ఎగరవేస్తాం: ఎమ్మెల్యే ముస్తాఫ్ఫా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 12:07 PM

గుంటూరు నగరంలో ఎంతో చారిత్రాత్మక నిర్మాణమైన జిన్నా టవర్ నకు జాతీయ పతాక రంగులు వేసి, జాతీయ జెండా ఎగరవేస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫ్ఫా అన్నారు. జిన్నాటవర్ పై జెండా ఆవిష్కరించుటకు దిమ్మె ఏర్పాటు చేయాలని స్థానిక ముస్లిం మత పెద్దల కోరిక మేరకు సదరు ప్రాంతంలో జెండా దిమ్మె మరియు టవర్ నకు జాతీయ పతాకం రంగులు వేయాలని నగరపాలక సంస్థ అధికారులను గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా ఆదేశించారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల, వివిధ డివిజన్ ల కార్పొరేటర్లు, ఈస్ట్ డిఎస్పి సీతారామయ్య, నగరపాలక సంస్థ యస్ఈ. దాసరి శ్రీనివాసరావు , సిపి హిమబిందు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, ముస్లిం మత పెద్దలు, స్థానిక ప్రజలు, వైసిపి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa