ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు కిందపడి ఇద్దరు యువతులు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 01:28 PM

కడప రైల్వేస్టేషన్ విశ్వనాధపురం సమీపంలోని రైల్వేగేట్ వద్ద గూడ్స్ క్రింద పడి ఇద్దరు యువతులు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు, అనంతపురం జిల్లాకు చెందిన ఇరువురు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనకు సంబంధించి రైల్వే పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి.

అనంతపురం జిల్లా యాడికి కు చెందిన జి పూజిత (18), ఎస్ కళ్యాణి (18)లు సోమవారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో గూడ్స్ రైలు క్రింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్టు రైల్వే పోలీసులు తెలిపారు, యువతుల ఆత్మహత్య విషయాన్ని గమనించిన ప్రయాణీకులు రైల్వేపోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మృతులకు సంబంధించి ఆధారాలను సేకరించారు.

పూజిత అనంతపురం జిల్లా గుత్తిలోని గేట్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇ. సి. సి కోర్సు చదువుతుండగా, కల్యాణి తాడిపత్రిలోని సరస్వతి డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి చదువుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన ఈ ఇరువురు యువతులు ఇక్కడికివచ్చి ఆత్మహత్యకు పాల్పడడం గల కారణాలను రైల్వేపోలీసులు విచారిస్తున్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. కల్యాణి స్పాట్ లోనే మృతి చెందగా, పూజిత చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలిస్తుండగా మృతి చెందింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం రైల్వే పోలీసులు కడప రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఈ మేరకు రైల్వేపోలీసులు ఈ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa