అనంతపురం: కనేకల్ మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ ఆఫీస్ బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న ఇబ్రహీం అధికారుల సమావేశంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్యానికి ప్రయత్నించారు. ఈ సమయంలో, అక్కడ ఉన్న అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు అడ్డగించి వెంటనే చికిత్స కోసం కనేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పురుగుల మందు కొంచెం తాగడంతో సృహ కోల్పోవడం జరిగింది. వెంటనే వైద్యులు చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి తప్పించారు. పురుగుల మందు సగం తాగడంతో ఇంకా అనుమానంతో 108 వాహనంలో అనంతపురానికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. దీనికి గల కారణాల నెల నుంచి అధికారుల ఒత్తిడి, మరియు గ్రామపంచాయతీ ఇఓ అధికారుల సమావేశం ముందు అవమానించడమే కారణం అని బాధితుడి బంధువులు తెలిపారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దీనికి గల కారణాలు ఎవరైనా సరే శిక్షించాలని బంధువులు వాపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa