ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 09:33 AM

ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఇథనాల్‌ కలపని పెట్రోల్‌ ధరలు పెరగనున్నాయి. ఇథనాల్‌ కలిసిన పెట్రోల్‌ వాడకాన్ని పోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇథనాల్‌ ఉన్న పెట్రోల్‌ తో పోలిస్తే ఇథనాల్‌ లేని పెట్రోల్‌ పై లీటర్‌ కు రూ.2 అదనంగా ఎక్సైజ్‌ సుంకం తేడా ఉండనుంది. కాగా, ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు సగటున 8 శాతం మేర ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ ను విక్రయిస్తున్నాయి. చాలా ప్రైవేటు ఆయిల్‌ కంపెనీలు మాత్రం ఈ ఇంధనాన్ని విక్రయించడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa