ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేటీకరణ పోరు పదకొండో రోజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 12:59 PM

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఏపీజెన్కో బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రం ను ప్రైవేటీకరణ చేయకూడదని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ జెన్కో ఉద్యోగస్తులు కాంటాక్ట్ కార్మికులు చేపట్టిన ప్రైవేటీకరణ పోరు బుధవారం నాటికి పదకొండో రోజుకు చేరుకుంది.


ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ( దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం బ్రాంచ్) ఎస్ డి ఎస్ టి పి ఎస్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య వేదిక జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీ జెన్కో నేలటూరు) సంయుక్తంగా ఈ డిమాండ్ పై నిరసన కార్యక్రమం నల్లబ్యాడ్జీలు ధరించి చేస్తున్నారు.


జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు గుమ్మడి శ్రీనివాసులు, కృష్ణ చైతన్య, సుధాకర్, కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక నాయకులు నాగరాజు, రవీంద్ర, ప్రభాకర్, సురేష్ , ప్రసాద్ లు నాయకత్వం వహించారు. పలు అంశాలపై ఆ సంఘాల నాయకులు మాట్లాడారు.


ఉద్యమాన్ని మరింతగా బలోపేతం చేయడమే కర్తవ్యంగా అందరూ పని చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు.


ఏపీ జెన్కో ధర్మల్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఇంతటితో ఈ సమస్య ఆగిపోదని అంచలంచలుగా మరికొన్ని ధర్మల్ కేంద్రాలను ప్రైవేటీకరణ చేస్తారని మొదట్లోనే అడ్డుకుంటే భవిష్యత్తు బాగుంటుందని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సూచించారు.


శాంతి అనే ఆయుధంతో ఉద్యమాన్ని నడపాలని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. నిరసన కార్యక్రమం అనంతరం ఇంజనీర్లు కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa