ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పీఆర్సీ సాధన సమితి నాయకులు గురువారం చలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే ఉద్యోగుల ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ర్యాలీ నిర్వహించాల్సిన బీఆర్టీఎస్ రోడ్డులో కర్ఫ్యూ విధించారు. అలాగే విజయవాడలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పోలీసు కమిషనర్ తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. గురువారం నాడు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిషేధించారు. నిబంధనలు పాటించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa