ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ కీలక నిర్ణయం.. వాటిని పూర్తిగా తొలగించేందుకు రంగం సిద్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 06:16 PM

తిరుమల అంటే పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యం. అయితే ఈ అటవీ ప్రాంతంలో ఉన్న ఓ వృక్షజాతి జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. దీంతో అటు పర్యావరణానికి ఇబ్బందులు కలగడంతో పాటు జీవజాతులకు తీవ్రమైన ఆహార కొరతకు కారణమవుతోంది. జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోన్న అకేషియా చెట్లను పూర్తిగా తొలగించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. దాదాపు 2 వేల ఎకరాల్లో ఉన్న అకేషియా చెట్లను దశలవారీగా తొలగించి దేశీయ ఔషధ మొక్కలను నాటేలా ప్రణాళికలు రెడీ చేస్తోంది.
తిరుమల శేషాచల అడవుల్లో వివిధ రకాల జాతుల చెట్లు, వాటిలో తిరుమల క్షేత్రం చుట్టూ ఉన్న మొక్కలన్నీ అకేషియానే. పచ్చదనాన్ని వేగంగా పెంచడానికి ఈ అకేషియా చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని 1980నుంచి దాదాపు 800 హెక్టార్లలో ఈ చెట్లను నాటారు. ఆస్ట్రేలియా తుమ్మచెట్టుగా పిలిచే ఈ ఆకేషియా చెట్లు కేవలం పది నుంచి పదేహేను ఏళ్లలోపే తిరుమలగిరులను పచ్చగా మార్చేశాయి. అయితే ఈ చెట్ల ద్వారా జీవవైవిధ్యం దెబ్బతినడంతో పాటు చెట్ల కింద భూసాంద్రత నాశనమవుతోందని టీటీడీ దృష్టికి తీసుకువచ్చిన స్టేట్‌ బయోడైవర్సిటీ బోర్డు, అలాగే 4.5 శాతానికి పీహెచ్‌ చేరుకుని భూమిలో ఆమ్లాల శాతం అధికమవుతోందని హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa