లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో ఈ నెల 7/3/2026న తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. పట్టపగలే ఇంటి తాళం పగలగొట్టి, బీరువాను బద్దలు కొట్టి 246 గ్రాముల బంగారం, కొంత నగదును దొంగలు అపహరించారు. దర్యాప్తు చేపట్టిన లాలపేట పోలీసులు, ఇమ్రాన్ (40) మరియు రషీద్ (38)లను ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి 246 గ్రాముల బంగారం, 136 గ్రాముల గోల్డ్ పీసెస్, 132 చిన్న వజ్రాలు, నాలుగు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఇదివరకే దొంగతనం కేసులు ఉన్నాయని, బెయిల్ పై కోర్టుకు హాజరవుతూనే మళ్ళీ దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa