ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టికెట్ ధరలో 10శాతం రాయితీ..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 10:55 AM

సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే భక్తులకు APSRTC ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుపతి బస్సులో సీటు బుక్  చేసుకునేటప్పుడే... తిరుమల రాకపోకలకు కలిపి టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. బస్సు టికెట్  సహా శ్రీవారి దర్శనం టికెట్  బుక్  చేసుకున్నవారికి తిరుమలకు టికెట్లు జారీ చేయనున్నట్టు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. తిరుమల రాకపోకలకు టికెట్  తీసుకున్న వారికి టికెట్  ధరలో 10శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి చేరుకున్న సమయం నుంచి 72గంటల పాటు తిరుపతి-తిరుమల మధ్య టికెట్  చెల్లుబాటవుతుందని తెలిపారు. నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ నూతన సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa