ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుర్రాళ్లకు విరాట్ కోహ్లీ కీలక సూచనలు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 09:47 AM

అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో టీమిండియా(U19 Team India) శనివారం ఇంగ్లండ్‌(IND vs ENG) తో తలపడనుంది.ఫైనల్‌కు ముందు, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ యువ ఆటగాళ్లతో వీడియో కాల్‌లో మాట్లాడి, వారికి పలు చిట్కాలు అందించాడు. విరాట్ తన కెప్టెన్సీలో 2008లో భారత జట్టును అండర్-19 ఛాంపియన్‌గా నిలిపిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ(Virat Kohli)తో సంభాషణ వీడియోను అండర్-19 జట్టు సభ్యులు కౌశల్ తాంబే, రవ్‌జర్ధన్ హంగర్గేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది.


హంగర్గేకర్ తన పోస్ట్‌లో, ‘విరాట్ కోహ్లీ భయ్యాతో చాట్ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. తన నుంచి జీవితంతోపాటు క్రికెట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాను. ఇది రాబోయే కాలంలో మాకు సహాయపడుతుంది’ అని పేర్కొన్నాడు. అదే సమయంలో, కౌశల్ తాంబే తన పోస్ట్‌లో విరాట్‌ను గొప్ప ఆటగాడిగా అభివర్ణిస్తూ, ‘ఫైనల్‌కు ముందు గొప్ప ఆటగాడి నుంచి విలువైన సూచన’ అంటూ రాసుకొచ్చాడు.


సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..


సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 5న ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనుంది. సెమీ ఫైనల్‌లో భారత్ 96 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఈ టోర్నీలో భారత జట్టు వరుసగా నాలుగోసారి, ఓవరాల్‌గా 8వ సారి టైటిల్‌ మ్యాచ్‌లోకి ప్రవేశించింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 41.5 ఓవర్లలో 194 పరుగులకు కుప్పకూలింది. భారత్ తరఫున కెప్టెన్ యశ్ ధుల్ 110 పరుగులు చేయగా, షేక్ రషీద్ 94 పరుగులు చేశారు.


5వ సారి టైటిల్ అందేనా..


భారత్‌కు 5వ సారి టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. 2000, 2008, 2012, 2018లో భారత్‌ టైటిల్‌ గెలిచి, అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 3 సార్లు ఈ టైటిల్‌ను గెలుచుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa