విశాఖపట్నం: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు సమస్యలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పర్యటనలో భాగంగా 7, 8 వ వార్డు లో సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు , సమీక్ష సమావేశం నిర్వహించారు, సమీక్ష సమావేశం లో వార్డుల్లో ఉన్న సమస్యలు పై ఆరా తీయడం చేసారు, 7, 8 వార్డుల్లో డ్రైనేజీ , వీధి లైటు, పందులు సమస్యలు పై ప్రత్యేక దృష్టి పెట్టి శ్రద్ధ వహించాలని , కొండవాలు ప్రాంతాలలో త్రాగునీరు అందరికి అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు , సచివాలయం సిబ్బంది కి వాలంటీర్లు కు ఆదేశాలు జారీ చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమైనది అని ఆయన ప్రవేశపెట్టిన 30 రకాల సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందెలా చేయాల్సిన బాధ్యత మీదే అని సంక్షేమ పథకాలు అందించే విషయంలో నిర్లక్ష్యం అశ్రద్ద చూపితే ఉపేక్షించనని సచివాలయం సిబ్బంది వాలంటీర్లు కు ఆదేశాలు జారీ చేశారు, వాలంటీర్లు సచివాలయం సిబ్బంది కోఆర్డనేషన్ తో కలిసి మెలిసి పని చేసుకుంటూ వెళ్ళాలని సూచించారు, నేను మరల వచ్చి ఈ సమస్యలు పై మీ పని తీరు ఎలా ఉంది అన్నదానిపై పర్యటించి పర్యవేక్షిస్తానని మాట్లాడారు. ఈ సమీక్ష సమావేశం లో జోనల్ కమిషనర్ , అదికారులు , కార్పోరేటర్ గొలగాని అప్పారావు వార్డు ప్రెసిడెంట్ లు, నాయకులు , కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
![]() |
![]() |