తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి పాదాలకు శనివారం నుంచి ఆర్టీసీ సర్వీసులను నడిపేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు ఆర్టీసీ బస్సును శ్రీవారి పాదాలకు ప్రయోగాత్మకంగా నడిపారు. ట్రయల్ రన్ సమయంలో చిన్న లోటుపాట్లను గుర్తించారు. అవసరమైన చోట మలుపుల్లో మరమ్మతులు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు వెళ్లడానికి సమస్యలు లేకపోవడంతో శనివారం నుంచి శ్రీవారి పాదాలకు, మార్గ మధ్యంలోని శిలాతోరణానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను మొదలు పెట్టనున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు బస్సు అందుబాటులోకి ఉండేలా చర్యలు తీసుకున్నారు. తిరుమల నుంచి శ్రీవారి పాదాలకు రానుపోను రూ.55గా టికెట్టు ధరను నిర్ణయించారు. అటు కరోనా కేసులు తగ్గుముఖం పడితే ఈ నెల 15 తర్వాత భక్తులకు సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ప్రకటన చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa