శ్రీవారి దర్శనార్ధం ఈ నెల 9 వ తేదీన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమలకు రానున్నారు. 9 వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతిలో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు. సాయంత్రం తిరుమలకు పద్మావతి అతిథి గృహంలో రాత్రి వెంకయ్యనాయుడు బస చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం 10 వ తేదిన శ్రీవారి సేవలో వెంకయ్య నాయుడు దర్శించుకోనున్నారు. దర్శనంతరం మధ్యాహ్నం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు వెంకయ్య నాయుడు తిరిగి వెళ్ళనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa